1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :
• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి. • గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం • ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి • దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి
• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. • మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి. • పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు. • సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి. • పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
• సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది. • నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి. • నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి. • పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి. • అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.
• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది. • కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది. • నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి. • విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి. • నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి. • ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి. • నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :
• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి. • గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం. • ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి. • దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.