Contributed by issacfinny2000 on Fri, 2013-09-13 15:43
కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్తను తొలగించి అధిక మొలకశాతం రాబట్టటానికి , లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 6.3 మి.లీ లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10 మి.లీ గాఢ నత్రికామ్లం కలిపి ఆ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మండేకట్టాలి
File Courtesy:
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
Contributed by issacfinny2000 on Fri, 2013-09-13 15:28
కిలో విత్తానానికి మూడు గ్రాముల కార్బెండజిం ను కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి . దంపనారు మడులకైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజిం ను కలిపి,ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండేకట్టి మొలకలను దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటరు మందు నీరు సరిపోతుంది.
File Courtesy:
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
Contributed by issacfinny2000 on Fri, 2013-09-13 15:26
కిలో విత్తానానికి మూడు గ్రాముల కార్బెండజిం ను కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి . దంపనారు మడులకైతే లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండజిం ను కలిపి,ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండేకట్టి మొలకలను దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టటానికి లీటరు మందు నీరు సరిపోతుంది.
File Courtesy:
Dr.C.Cheralu, Principal Scientist,Regional Agricultural Research Station,Warangal, ANGRAU
ಎಲೆ ಕವಚ ಕೊಳೆ ರೋಗ, ಕುತ್ತಿಗೆ ಬೆಂಕಿ ರೋಗ ಹಾಗೂ ಕಂದು ಜಿಗಿ ಹುಳುಗಳ ಹತೋಟಿ ಕ್ರಮಗಳು
ಪ್ರಸ್ತುತ ಮುಂಗಾರು ಹಂಗಾಮಿನಲ್ಲಿ ನಂಜನಗೂಡು ಹಾಗೂ ಟಿ.ನರಸೀಪುರ ಭಾಗದಲ್ಲಿ ಬೆಳೆದಿರುವ ಭತ್ತದ ಗದ್ದೆಗಳಲ್ಲಿ ಎಲೆಗಳ ಮೇಲೆ ಕಂದು ಮಚ್ಚೆಗಳು ಕಂಡು ಬಂದಿದ್ದು, ಎಲೆಗಳು ಕೆಂಪು ಹಳದಿ ಬಣ್ಣಕ್ಕೆ ತಿರುಗಿದ್ದು, ಒಣಗಿದಂತೆ ಕಾಣುತ್ತಿದೆ. ಇದು ಕವಚ ಕೊಳೆ ರೋಗದ ಚಿಹ್ನೆಯಾಗಿದೆ. ಇಂತಹ ಚಿಹ್ನೆ ಕಂಡು ಬಂದಾಗ ಕೆಳಗೆ ಸೂಚಿಸಿರುವ ನಿರ್ವಹಣಾ ಕ್ರಮಗಳನ್ನು ರೈತರು ಕೈಗೊಳ್ಳಬೇಕಾಗುತ್ತದೆ.
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :
• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి. • గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం. • ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి. • దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.
• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. • మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి. • పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
• దుబ్బుచేసే దశలో, అంకురం దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. • కలుపు నాశక మందులు వేసినప్పుడు పొలంలో 2-3 సెం.మీ. లోతు నీరుండేలా చూసుకోవాలి. ఒక వారం రోజుల వరకు ఈ నీరు అలాగే ఉంచాలి. • నాటిన (ఊడ్చిన) తరువాత ఒక వారం రోజులపాటు 5 సెం. మీ. వరకు నీరు నిలగట్టాలి. ఆ తరువాత దుబ్బు చేయడం పూర్తయ్యేవరకు 2-3 సెం. మీ. లోతు నీరు ఉండాలి. • అంకురం దశ నుండి గింజ గట్టిపడే దశవరకూ 5 సెం. మీ. లోతు వరకు నీరుండాలి. • ఎరువులు వేసే ముందు నీరు వదిలెయ్యాలి. • కోతకు వారం రోజుల ముందుగా నీటిని వదిలెయ్యాలి .
• జింకు లోపం అధికంగా ఉండే చవిటి నేలలు, లోతట్టు పొలాలు, ఇటీవల చదును చేసిన పొలాలు, సి: ఎన్ నిష్పత్తి ఎక్కువగా ఉన్న వరిగడ్డి వంటి సేంద్రీయ పదార్ధాలు అధిక మొత్తంలో వేసిన పొలాలలో ముందుజాగ్రత్త చర్యగా మూడు పంట సీజన్లకొకసారి హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో వేయాలి.
• మిగతా పొలాల్లో జింకు లోపం గమనించినప్పుడు 0.2 % జింకు సల్ఫేటు ద్రావణం 5 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.
• నాట్లు వేయడానికి పది రోజుల ముందే దమ్ము చేసి, ఆ తర్వాత మురగ దమ్ము చేసి, బాగా చదును చేయాలి. • బరువు నేలలలోను, సారవంతమైన నేలలలోను చ. మీ. కు (20 X 15 సెం. మీ.) 33 మూనలు ఉండేలా చూడాలి. • తేలిక నేలలలోను, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లోనూ నారును 15 X 15 సెం.మీ. దూరంలో (చ.మీ. కు 44 మూనలు ఉండేలా) నాటుకోవాలి. • ఆలస్యంగా నాటిన సందర్భాల్లో చ.మీ. కు 44 మూనలు ఉండాలి. • కలుపు ఉధృతిని తగ్గించడానికి, సమర్ధవంతమైన నీటి యాజమాన్యానికి ప్రధాన పొలాన్ని బాగా చదును చేయాలి